కీర్తిశేషులు యెన్నం ప్రసూన్ రెడ్డి జయంతి కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం సంగేం గ్రామంలో మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమానికీ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డీ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు సి.ప్రతాప్ రెడ్డీ,బక్కని నర్సింహులు తదితర నాయకులు ఈ జయంతి వేడుకలకు పెద్దఎత్తున హాజరయ్యారు. కేశంపేట్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలు,మహిళలతో పాటు వివిధ ప్రాంతాల నుండి
మహిళలు హాజరవడం విశేషం.ఈ సందర్భంగా ప్రసూన్ రెడ్డీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డీ,మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు,తలకోండపల్లి మాజీ ఎంపిపి శ్రీనివాస్ యాదవ్ , ,శంకర్,జగదీష్,న్యాయవాది చెంది మహేందర్ రెడ్డీ తదితరులుపాల్గొన్నారు .
మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కీర్తిశేషులైన ప్రసూన్ రెడ్డి తల్లిదండ్రులు మరణించిన కుమారుడి పేరిట చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు.ప్రతి గ్రామంలో ప్రతి పేద తల్లిదండ్రుల ఇంట్లోప్రసూన్ రెడ్డీ చిరంజీవిలా వర్ధిల్లుతున్నాడని అన్నారు.ప్రసూన్ రెడ్డీ పేరిట జరుగుతున్న సామాజిక సేవల్లో అతి ప్రధానమైన అన్నదానం,మహిళలకు చీరల పంపిణీ,విద్యాదానం,మంచి
నీటి వసతి తదితర సేవలు అద్భుతమని వారు కొనియాడారు.ఎవరైనా చనిపోతే కొద్దికాలం మాత్రమే గుర్తుంచుకుని ఆతరువాత మరిచిపోయే ఈ కాలంలో గత పదిహేను సంవత్సరాలుగామృతి చెందిన కుమారుడు పేరిట ఇన్ని రకాల సేవలు పేద ప్రజలకు చేయడం మరెవరికీ సాధ్యం కాదని వక్తలు అన్నారు.
దాన ధర్మాలు చేయడానికి పదిసార్లు ఆలోచించే ఈ రోజుల్లో ఇలాంటివి పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయడం యెన్నం గోపాల్ రెడ్డీ కుటుంబ సభ్యులకే చెల్లిందని కొనియాడారు. పేద ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను గుర్తించి ఇలా సేవలు చేయడమే గాక ఎందరో అభాగ్యులకు గుప్త దానాలు చేసి కన్న కొడుకుని సేవా రూపంలో చూసుకోవడం ఏతల్లీదండ్రీకి సాధ్యం కానిదానిఅన్నారు.తన కుమారుని జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో సంతృప్తి ఇస్తుందని గోపాల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా జయంతిని పురస్కరించుకుని వేలాది మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు యెన్నం గోపాల్ రెడ్డీ,సుకన్య,నవీన్ రెడ్డీ,ప్రవీణ్ రెడ్డీ,షాద్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ విశ్వం,కౌన్సిలర్లు విజయ్ రెడ్డీ,రాజేందర్ రెడ్డీ,అప్పి,స్థానిక నేతలు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి కుమార్ యాదవ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ , జడ్పీటీసీ పల్లె నర్సింగ్ రావు , పీఏసీఎస్ చైర్మన్ శంకర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్ , మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి , సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి , నారాయణ రెడ్డి , నాయకులు శ్రీనివాస్ యాదవ్ , భూపాల్ రెడ్డి , నర్సిములు యాదవ్ , జంగయ్య , కృష్ణా రెడ్డి , పల్లాటి కృష్ణయ్య , శ్రీనివాస్ యాదవ్ ,వెంకటేశం , వెంకన్న యాదవ్ , రమేష్ , శ్రీకాంత్ రెడ్డి ,రాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.