నిన్న ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.410 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 513.580 అడుగులు. ఇన్‌ఫ్లో 1700 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1700 క్యూసెక్కులుగా ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న గండీపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ రెండు జలాశయాల్లో వరద నీరు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
