ఈ నెలలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ శుభవార్త అందించింది . ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్తగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ముంబై నుంచి ఢిల్లీకి 13.30 గంటల వ్యవధిలోగా చేరుకునేలా 18 కోచ్ లతో రాజధాని ట్రయల్ రైలును అధికారులు నడిపారు. అత్యంత వేగంగా నడిచే ఈ రైలుకు రెండు లోకో ఇంజన్లు ఏర్పాటు చేశారు.గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ముంబై – ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెప్పారు.