ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .
ఈ క్రమంలో నెల్లూరు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ,నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జగన్ ముఖ్యమంత్రి కావాలని రొట్టెల పండగ సందర్భంగా ఒక పని చేశారు .అదే బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక రొట్టెను అందుకున్నారు.
ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే దోచుకోవడం తప్ప ప్రజలకు బాబు సర్కారు ఏమి చేయడం లేదు అని ఆరోపించారు .