చినజీయర్ స్వామితో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. శంషాబాద్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు జగన్. శంషాబాద్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ భేటీ జరిగింది. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, వైసీపీ ముఖ్యనేతలు ఆశ్రమాన్ని సందర్శించారు. జగన్‌తోపాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు.
దాదాపు అర గంట పాటు వీరంతా సమావేశమయ్యారు. ఆశ్రమానికి వచ్చిన జగన్‌కు చినజీయర్ స్వామి శాలువా కప్పి సన్మానించారు. ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపైనా వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం . ఇటీవల ఒక శుభకార్యంలో చినజీయర్, జగన్ కలిశారు.
ఆ సమయంలో తన ఆశ్రమానికి రావాల్సిందిగా చినజీయర్ జగన్‌కు సూచించారు. ఈనేపథ్యంలోనే ఆయన చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలోని విశేషాలను చినజీయర్… జగన్‌కు వివరించారు. జగన్ తిరుగు ప్రయాణం సమయంలో చినజీయర్ కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఇటీవల ఎన్టీవి అధినేత కుమార్తె వివాహంలోనూ జగన్, చినజీయర్ కలిశారు. ఆ సమయంలో కేవీపీ కూడా అక్కడే ఉన్నారు. చినజీయర్‌కు జగన్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.