సీఎం కేసీఆర్ మాటల గారడీతో మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న బిజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామాకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో కోర్టులో ఎందుకు తెలపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తే ఇప్పుడు ఇతర సంఘాల నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో మాత్రం ఎందుకు నిధులు కేటాయించలేదని అడిగారు. సింగరేణి ఎన్పికల్లో టీబీజీకేఎస్‌కు ఓటమి తప్పదని కిషన్ రెడ్డి అన్నారు.