ఈ రోజు బంగారం ధర పతనమైంది. మొత్తం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఆశించిన మేర లేకపోవడంతో ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.14శాతం తగ్గడంతో ఔన్సు 1,268.70 డాలర్లు పలికింది.