ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ “అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నోరుజారి పలు విమర్శలకు గురైన సంగతి విదతమే .తాజాగా చంద్రబాబు అదే విధంగా నోరు జారారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .
ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యాతిధిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు ,నేతలు ,కార్యకర్తలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ప్రజలచేత స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ప్రతిజ్ఞను చేయించారు .
ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞను చేయిస్తూ రోజు వందమందితో నామాదిరిగా వంద గంటలు పనిచేయించి స్వచ్ఛ ఆంధ్ర గా తీర్చిదిద్దుతా అని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పించారు .అయితే బాబు అన్నది రోజుకు వంద గంటలా ..?లేదా నెలకు వంద గంటలా అని క్లారిటీ ఇవ్వకుండా వందమంది చేత వంద గంటలు అని అనడం నెటిజన్లకు బాబు మంచి ఆయుధం ఇచ్చినట్లైంది .
దీంతో నెటిజన్లు రెచ్చిపోయి రోజుకు ఇరవై నాలుగు గంటలు అయితే వందమంది చేత వంద గంటలు ఎలా పని చేయిస్తారు అని సెటైర్లు వేస్తోన్నారు .గతంలో పల్లె రఘునాథ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు ముప్పై ఆరుగంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అని అంటూ నోరు జారారు .తాజాగా బాబు మరో అరవై నాలుగు గంటలను కల్పుకొని మొత్తం వంద గంటలు అని అంటున్నాడు అని నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు ..