భూపలపల్లి అంబేద్కర్ సెంటర్ దగ్గర టీబీజీకేఎస్ బహిరంగసభ జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కవిత, వినోద్, పసునూరి దయాకర్, సివిల్‌సైప్లె కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. సభలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ 2016లోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇస్తమన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మిక వ్యతిరేకులు ఆపిన్రు. వారసత్వ ఉద్యోగాలు అంటే కోర్టుల్లో నిలవడం లేదు. కారుణ్య నియామకాల పేరుతోని వారసత్వ ఉద్యోగాలిస్తామని తెలిపారు. వారసత్వ నియామకాల్లో ఇప్పటి వరకు ఏడు వ్యాదులే ఉన్నాయి. కారుణ్య నియామకాల్లో కొత్తగా భారీగా రోగాల జాబితాను చేరుస్తామని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత వ్యధులతో పాటు బొగ్గుబావిలో పనిచేసే కార్మికులను ప్రత్యేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అరునూరైనా కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. 20 వేల మంది కార్మికులు తప్పుడు పేర్లతో ఉన్నరు. వన్‌టైమ్ కరక్షన్ కింద వారి పేర్లను సరిచేస్తం. ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని వెల్లడించారు. అన్ ఫిట్ అయిన కార్మికులకు జీతాలు తగ్గకుండా చర్యలు తీసుకుంటం. సింగరేణి కూడా కోల్ ఇండియా కేడర్ స్కీం అమలు చేస్తాం. సింగరేణిలో అంబేద్కర్ జయంతిని సెలవుదినంగా ప్రకటిస్తామని హామి ఇచ్చారు.