టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. చాన్నాళ్లకు బుల్లితెరమీద నీతొనే డాన్స్ చేస్తా అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ షో ఓపెనింగ్ రోజున రేణు మంచి డాన్స్ పెర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఈ షోలో కనబడే ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అసలు విషయం ఏంటంటే రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట. పవన్‌తో రేణు విడిపోయాక ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
వారిద్దరికి కల్గిన సంతానం ఇద్దరు పిల్లల బాధ్యతలతో రేణు దేశాయ్ గడుపుతుండగా.. పవన్ మాత్రం మరో ఆమెను వివాహం చేసున్నాడు. అయితే రేణు మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. ఇక నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్న రేణుకు ఒక ఇన్సిడెంట్ మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించేలా చేసిందట. ఇటీవల తనకి ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు ఆమె అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలోనే రేణుకి మరో పెళ్లి ఆలోచన వచ్చిందట. అసలు తనని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి.. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని ఆక్షణంలో అనిపించిందట. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని రేణు మరో పెళ్లి గురించి ఆలోచన మొదలు పెట్టానని చెప్పిన రేణు ఆ పెళ్లి రాత రాసిపెడితే అవుతుందని.. ఆ టైం ఎప్పుడొస్తుందో చూద్దామని రేణు దేశాయ్ అన్నారు.