సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే తెలంగాణ రాష్ట ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే నెటిజన్లు పోస్ట్ చేసిన పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన విషయం తెలిసిందే . తాజాగా సికింద్రాబాద్‌లోని సిక్ విలేజి జైన్ భవన్ వద్ద గత మూడు రోజులుగా గుర్తు తెలియని ఓ వృద్ధురాలు రోడ్డు పక్కన ఉన్నది. దీనిని గుర్తించిన ఓ నగర పౌరుడు మంత్రి కేటిఆర్ కు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీనికి స్పందించిన మ్రంతి కేటీఆర్ వెంటనే ఆ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ట్వీట్ చేశారు.
దీంతో జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ రాజ్ ఆది వారం వెంటనే అక్కడికి చేరి వృద్ధురాలిని పలుకరించి ఆమెకు అల్పాహారం తిని పించారు. తన వాహనంలో కూర్చోబెట్టుకొని సికింద్రాబాద్ నామాల గుండులో ఉన్న జీహెచ్‌ఎంసీ, అమన్‌వేదిక నైట్‌షెల్టర్ హోంకు తీసుకెళ్లారు. ఆ వృద్ధురాలి మానసిక స్ధితి బాగాలేదని చెప్పి ఆశ్రమం నిర్వాహకులకు ఆమెను అప్పగించారు.రోడ్డు దిక్కులేకుండా పడి ఉన్న తనకు సాయం అందించిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపింది.