హైదరాబాద్ నగరంలో ఈ రోజు కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించమన్నారు. విద్యుత్‌శాఖ కంట్రోల్‌రూం నెంబర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా వెంటనే చక్కదిద్దేలా పనిచేస్తున్నామని అన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందన్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యం జరుగుతుందని, అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు ఫోన్ చేయాలని మంత్రికేటీఆర్ తెలిపారు.