తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న ఆదివారం ఏపీలో ఆ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరాం వివాహమోత్సవానికి హాజరైన సంగతి విదితమే .తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని అక్కడ నుండి హెలికాప్టర్ లో ప్రయాణించి వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు .అయితే వివాహమోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తదనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఇటు పరిటాల అభిమానులే కాకుండా టీడీపీ నేతలు ,కార్యకర్తలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజలు నినాదాలు చేస్తూ ..అభివాదాలు చేశారు .అయితే గతంలో పద్నాలుగు యేండ్ల పాటు ఉద్యమం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఏపీ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకోవడం పై మంత్రి కేటీఆర్ స్పందించారు .ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలు చూపిన అభిమానానికి ‘ఫిదా’ అయిపోయారు. ‘విభజనకు ముందు నాటి పరిస్థితులు వేరు.. ప్రజలు చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నారు..’ అంటూ కేసీఆర్ అనంతపురం టూర్ ఫొటోల్ని షేర్ చేస్తూ, కేటీఆర్ కామెంట్ చేయడం గమనార్హం.