స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ మల్హోత్రా-ఆలియా భట్‌ల మధ్య ఎఫైర్ నడుస్తోందని ఎప్పటినుండో బి టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లిద్దరి మధ్యలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంటరైందని ఈ మధ్య గాసిప్స్ హాల్ చల్ చేశాయి. సిద్దార్థ్ తో ఓ సినిమా చేసిన జాక్వెలిన్.. అతడితో చాలా దూరం వెళ్లిందని వార్తలు వచ్చాయి.దీంతో సిద్దార్థ్-అలియా మధ్య దూరం పెరిగిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు వీటిపై స్పందించింది జాక్వెలిన్.. సిద్దార్థ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది.
అంతే కాకుండా అతడితో డేటింగ్ చేయాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని, ఇదే విషయంపై ఫోన్‌లో అలియాతో కూడా చర్చించానని చెబుతోంది. తమ మధ్య ఏమీ లేదనే విషయాన్ని క్లియర్ గా అలియా భట్ కు వివరించానని ఓ టీవీ రియాలిటీ షోలో బయటపెట్టింది జాక్వెలిన్. ఈ ఫోన్ కాల్ తర్వాతే సోషల్ మీడియాలో తామిద్దరం మరోసారి యాక్టివ్ అయ్యామని ప్రకటించిన జాక్వెలిన్. భవిష్యత్తులో అలియాతో నటించాల్సి వస్తే ఆ అవకాశాన్ని మిస్ చేసుకోనని అంటోంది. మొత్తానికి సిద్దార్థ్ మల్హోత్ర, అలియా భట్ మధ్య ఏదో ఉందనే విషయం జాక్వెలిన్ స్టేట్ మెంట్‌తో మరోసారి రుజువైంది.