ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా వాన. హైదరాబాద్‌ను ఇవాళ భారీ వర్షం ముంచెత్తింది. ఒకేతీరుగా దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముైద్దెంది. కనీసం రెండు గంటల నుంచి ఒకటే రేంజ్‌లో వర్షం పడుతున్నది. దీంతో కీలక ప్రాంతాలన్నీ జల మయం అయ్యాయి. మెరుపులా కురిసిన వర్షం వల్ల నగరంలో ట్రాఫిక్ భారీగా జామైంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు GHMC అధికారులు.జంట నగరాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాతే ఉద్యోగస్తులు కార్యాలయాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాలన్నారు.
హెల్ లైన్ నెంబర్: 040-21111111,100