Home / TELANGANA / హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..

తెలంగాణ రాష్ట రాజధాని  హైదరాబాద్ నగరంలో ఈ రోజు  సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ బాగానే ఉన్నప్పటికీ.. సాయంత్రం 4  గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పాతబస్తీలో ప్రారంభమైన వర్షం హైదరాబాద్  నగరమంతా వ్యాపించింది. నగరంలోని పలుచోట్ల వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వాన నగరాన్ని వణికిస్తుంది.

భారీ వర్షానికి భయపడిన ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదు. వాహనదారులు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంటుంది.

చార్మినార్, యాకుత్‌పురా, డబీర్‌పురా, ఉప్పుగూడ, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, పురానాపూల్, జియగూడ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, ఈసీఐఎల్‌లో భారీ వర్షం కురుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat