తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరై నూతన వవధూవరులను ఆశీర్వదించారు .ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెంకటాపురం గ్రామాస్తులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి హాజరైన ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు .నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు .
ఈ భేటీ పై ఇటు సోషల్ మీడియాలో అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి .ఈ క్రమంలో ఇటీవల ఏపీలో జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలు ,తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై చర్చించారు అని ..లేదు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు అని ..లేదు ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పయ్యావుల కేశవ్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని కూకట్ పల్లికి తీసుకెళ్ళానున్నారు అని ఇలా పలు రకాలుగా వార్తలను ప్రచారం చేశారు .
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైనా పాత మిత్రులు కానీ శ్రేయాభిలాషులు కానీ కలసినప్పుడు వ్యక్తిగత విషయాలతో పాటుగా యోగ క్షేమాలను కానీ అడిగి తెలుసుకుంటారు అని మనకు తెల్సిందే .నిన్న కూడా ఆదివారం చాలా రోజుల తర్వాత తన పాత మిత్రుడితో సరదగా అలా కాసేపు సమయం స్పెండ్ చేశారు తప్ప దీనిపై సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తోన్న వార్తలలో ఎటువంటి వాస్తవాలు లేవు అని అర్ధమవుతుంది .గతంలో ఏపీ రాజధాని అమరావతి ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తో కూడా ఇలా భేటీ అయిన సంగతి తెలిసిందే .