జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్‌బుక్‌లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్ చేసి అంటించింది.అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం ఆ చిన్నారిని టీచర్ మెచ్చుకోవడం ఏమో కానీ ఆ పాప తల్లితండ్రులు చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.
