లేడీ పింగర్ లో ఉండే పోషక విలువల గురించి చాలా మందికి అంతగా తెలియదు. బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంతకీ మీరెప్పుడైనా బెండకాయ రసాన్ని తాగారా? లేకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. బెండకాయ.. వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను అందిస్తుంది. బెండకాయ రసం తాగటం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గుతుంది.
బెండకాయ రసంలో విటమిన్ ‘సి’, మెగ్నీషియం, విటమిన్ ‘ఏ’ ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే బెండకాయ రసాన్ని తాగడం వలన గొంతునొప్పి తదితర సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బెండకాయ రసంలో ఉండే ఇన్సులిన్ గుణం మధుమేహ వ్యాధి స్థాయిలను తగ్గిస్తుంది. విరేచానాలను తగ్గించడంలో కూడా బెండకాయ భలేగా పనిచేస్తుంది. బెండకాయను ఆంగ్లంలో ‘లేడీస్ ఫింగర్’ అంటారు.
Post Views: 334