Home / TELANGANA / పరిటాల శ్రీరామ్ పెళ్లి..రేవంత్‌కు ప్రాణ సంకటం…!

పరిటాల శ్రీరామ్ పెళ్లి..రేవంత్‌కు ప్రాణ సంకటం…!

ఎంకి పెళ్లి, సుబ్బి చావుకు వచ్చినట్లు పరిటాల శ్రీరామ్ పెళ్లి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రాణ సంకటంగా మారింది. నిన్న ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల రవి వివాహంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దక్కిన గౌరవం, ప్రజాదరణ చూసి ఉంటే రేవంత్‌‌ మొహం మాడిపోయి ఉండేది..సొంత పార్టీ నేత అయిన రేవంత్‌రెడ్డికి ఆహ్వానం దక్కలేదో..మరి ఆహ్వానం వచ్చినా రేవంత్ వెళ్లలేదో కానీ వెళ్లి ఉంటే కేసీఆర్‌కు సొంత టీడీపీ పార్టీ నేతలు ఇచ్చిన గౌరవమర్యాదలు చూసి కచ్చితంగా కుళ్లు కుళ్లి ఏడ్చి ఉండేవాడేమో..కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీలో కేసీఆర్‌కు దక్కిన గౌరవం కచ్చితంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చివేయడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణలో కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం పోరాడుతోంది…అయితే కేసీఆర్ మాత్రం అటు పార్టీలో రెడ్లకు ప్రాధాన్యం ఇస్తూనే కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలను చేరదీస్తున్నారు. మంత్రి తుమ్మల టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం ఆ పార్టీకి చేరువైంది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ తరపున రేవంత్ రెడ్డి పోరాడుతుంటే , ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కేసీఆర్‌‌కు సాగిలపడుతుంది..ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు, కేసీఆర్‌‌ను పెద్దగా విమర్శించడం లేదు..అసలు తెలంగాణ టీడీపీని పట్టించుకోవడం లేదు..రేవంత్ ఒక్కడే గొంతు చించుకుని నోరు చేసుకుంటున్నాడు కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది..ఇక కేసీఆర్‌కు టీడీపీలో చాలా మంది మిత్రులే ఉన్నారు..వారు చంద్రబాబు కంటే కేసీఆర్‌‌నే ఎక్కువగా ఇష్టపడతారు అనడంలో సందేహం లేదు..చంద్రబాబు పాలన కంటే కేసీఆర్ పాలనే బెటర్ అని ఏపీ టీడీపీలో చాలా మంది నాయకుల తమ అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటారంట. నిన్న పరిటాల శ్రీరామ్ పెండ్లికి వెళ్లిన కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు బ్రహ్మరథం పట్టారు..అడుగడుగునా కేసీఆర్‌కు నీరాజనాలు పలికారు..ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడికి, పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో గౌరవ మర్యాదలు ఇంత వరకూ ఎక్కడా జరుగలేదు..ఓ దశలో టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదనడంలో సందేహం లేదు..మొత్తానికి కేసీఆర్‌కు ఏపీ టీడీపీ దగ్గరవుతుంటే..ఇక్కడ తెలంగాణలో రేవంత్ వెర్రిపుష్పం అవుతున్నట్లు నిన్న పరిటాల పెండ్లి సీన్‌ నిరూపించింది..తెలంగాణలో ఉన్న కమ్మ టీడీపీ నేతలు కూడా కేసీఆర్‌కే మద్దతు పలకడం ఖాయమని తెలుస్తోంది. సో..కమ్మ టీడీపీలో ఇమడలేకపోతున్న రేవంత్ రెడ్డికి..కాంగ్రెస్‌కు జంప్ అవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు..రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం వహించే కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి ఎంట్రీకి ఆయన బంధువు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సహకరించడానికి సిద్ధంగా ఉన్నా.కాంగ్రెస్‌లో పోతే సీఎం కాలేనన్న డౌట్‌తో, ఎక్కడ కాంగ్రెస్‌లోకి పోతే కేంద్రంలోని బిజేపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసు తిరగదోడి జైలుకు పంపిస్తారో అన్న భయంతో రేవంత్ టీడీపీలో ఉంటున్నాడు..కానీ నిన్న అనంతపురంలో సీఎం కేసీఆర్‌కు తమ సొంత పార్టీ నేతలు ఇచ్చిన గౌరవ మర్యాదలు, అనంతపురం ప్రజల జేజేలు చూసిన రేవంత్‌కు ఇక తాను పార్టీలో ఉండి ప్రయోజనం లేదని తెలిసివచ్చింది..సో..పరిటాల పెండ్లి తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం కల్పించింది. ఇక రేవంత్‌ రెడ్డికి `కమ్మ `టీడీపీ నుంచి బయటకు వెళ్లక తప్పని స్థితి ఏర్పడింది..మొత్తానికి పరిటాల శ్రీరామ్ పెళ్లి..రేవంత్ రెడ్డి చావుకు వచ్చిందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జోకులేసుకుంటున్నారంట..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat