రోజు రోజుకీ సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఎన్ని నిర్భయ చట్టాలు తీసుకువచ్చినా, కఠిన చట్టాలు అమలు చేసినా కామాంధులు దేశంలో ప్రతి చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు..మూడేళ్ల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.. మృగాళ్లు. సామాన్యులే కాదు..మహిళా రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కూడా మగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు..తాజాగా బిజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు..దేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో మగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు..ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌లో జరిగిన రెడ్ బ్రిక్ సదస్సులో మాట్లాడిన ఎంపీ పూనమ్ మహాజన్ ఓ దశలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని అన్నారు..ఇండియాలో ప్రతి యువతి ఎప్పుడో ఒకప్పుడు మగాళ్ల చేతిలో శారీరక హింసకు గురైనవారే
అని ఆమె ఆవేదన చెందారు. పబ్లిక్ ప్లేసులలో తాకరాని చోట తాకడం ప్రతి మహిళకు ఎదురయ్యేదేనని ఎంపీ పూనమ్ అన్నారు. నేను వర్లీ నుంచి వెర్నోవా వరకు రైల్లో వెళుతుండేదాన్ని. ఆ సమయంలో కారులో వెళ్లేంత డబ్బు మా కుటుంబం దగ్గర లేదు..రైల్లో మగాళ్లు నన్ను కొరకొరా చూసేశారు..ఒళ్లంతా తడిమేలా వారి చూపులు ఉండేవి..ఒక్కోసారి వారి చూపులు భరించలేనంగా అసహ్యంగా ఉండేవి.. రద్దీ సమయంలో కావాలని తాకరాని చోట తాకుతూ వికృతానందనం పొందే మగాళ్లు దేశంలో పేట్రేగిపోతున్నారని ఆమో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఈ భూమ్మీద ప్రతి మహిళ..ముఖ్యంగా ఇండియాలో ప్రతి మహిళ ఎదుర్కొంటుందని మహాజన్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ
అవాంఛిత తాకుళ్ల అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. వాటిని చెప్పుకోలేక ఎంతో బాధపడిన వారే”నని పూనమ్ మహజన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా మిమ్మల్ని వేధించాలని భావిస్తే వెంటనే అతను ఏం చేశాడన్న విషయాన్ని పక్కనపెట్టి లాగి రెండు చెంపలు వాయించాలని, ఈ తరహా లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి మహిళలు మరింత ధృడంగా మారాలని ఆమె పిలుపునిచ్చారు.
