ఏపీ సీఎం చంద్రబాబుకు మిత్ర పక్షం బిజేపీకి చెందిన సీనియర్ మంత్రి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు..ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే..దీంతో పదవీ ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న తరుణంలో సుధాకర్‌కు టీటీడీ ఛైర్మన్ పదవి అందినట్లే అంది దూరమవుతుంది..పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించిన చంద్రబాబు నిర్ణయాన్ని బిజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు నిలిపివేశారు..టీటీడీ ఛైర్మన్‌గా సుధాకర్ నియామకంపై ఏపీలో సర్వత్రా విమర‌్శలు వెల్లువెత్తుతున్నాయి..టీటీడీ ఛైర్మన్ పదవి కోసం కమ్మ సామాజికవర్గానికి చెందిన మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఊరుపేరు లేని సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన చంద్రబాబును సొంత సామాజిక వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..ఇదిలా ఉండగా పుట్టాసుధాకర్ యాదవ్‌కు పలు క్రైస్తవ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు, పలు క్రైస్తవ స్వస్థత సభలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరైనట్లు ఆధారాలు బయటపడ్డాయి..దీంతో హిందూ సంప్రదాయవాదులు, టీటీడీ ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్ ఎంపిక పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. టీటీడీ ఛైర్మన్ ఎంపిక వివాదాస్పదం కావడంతో దేవాదాయ శాఖ మంత్రి ప్రస్తుతానికి టీటీడీ ఛైర్మన్ పదవిని నిలిపివేస్తున్నట్లు..అందరి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. టీటీడీ ఛైర్మన్ పదవిని సుధాకర్ యాదవ్‌కు ఇచ్చే విషయమై చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా దేవాదాయ శాఖ మంత్రి పునరాలోచన చేయడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే పాటించేది లేదని ఈ ఉదంతంతో బిజేపీ మంత్రి మాణిక్యాలరావు చెప్పకనే చెప్పినట్లయింది.
