మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ అయన ట్వీట్ చేశారు.
