Home / SLIDER / కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..

కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ .

గత కొన్ని ఏండ్లుగా దత్తాత్రేయ ప్రతి దసరా పండగ పర్వదినాన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రంగాల ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని దత్తన్న ఘనంగా నిర్వహిస్తుంటారు .తాజాగా ఈ ఏడు కూడా దత్తన్న నిర్వహించారు .

ఈ కార్యక్రమానికి హజరైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎంపీ వి హన్మంత రావు మాట్లాడుతూ “దత్తన్నను కేంద్రంలో ప్రమోషన్ వస్తుంది అని అనుకున్నాం కానీ ఉన్న కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించారు .అయితే పార్టీలో ఎంతో సీనియర్ నేత అయిన దత్తన్నను మంత్రి పదవి నుండి తప్పించడం చాలా బాధాకరం ..ఆయనకు కేంద్రంలో ఆ పార్టీ జాతీయ అధిష్టానం తీవ్ర అవమానపరిచింది అని ఆయన అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat