జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి .అందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్,స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న అంటరానితనం నిర్మూలన, గ్రామ స్వరాజ్యం, అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.