తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష (సీఎల్పీ )సమావేశం ఈ నెల నాలుగో తేదిన జరగనున్నది .ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సమావేశాల్లో తమ పార్టీ వ్యూహాలను ఖరారు చేసేందుకు అసెంబ్లీలోని హాలు1 లో నాలుగో తారుఖు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .
