హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలో పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఇబ్బంది వున్నా వెంటనే స్పందించాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం సూచించారు.
