Home / SLIDER / సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

సీఎం కేసీఆర్ ఏపీ ప్రజల మదిని దోచుకోవడానికి ప్రధాన కారణమిదే ..?

ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన వధూవరులు జ్ఞాన, పరిటాల శ్రీరాంకు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అంతే కాకుండా నూతన వధూవరులు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.వివాహానికి హాజరైన పరిటాల అభిమానులు, టీడీపీ నాయకులు, బంధువులకు సీఎం కేసీఆర్ అభివాదం చేశారు.అయితే ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్ట మొదట వెంకటాపురం లో హెలికాప్టర్ దిగగానే అక్కడికి చేరుకున్న టీడీపీ ,స్థానిక ప్రజలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి శ్రీరామ్ వివాహానికి హాజరైన పరిటాల అభిమానులు ..ప్రజలు ముఖ్యమంత్రి ని అభివాదాలు చేస్తూ ..జై కేసీఆర్ ..జయహో కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు .ఇదే వివాహానికి హాజరైన సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరైన సందర్భంగా ప్రజలు కానీ స్వయంగా టీడీపీ నేతలు ,కార్యకర్తలు కానీ చడి చప్పుడు లేకుండా మౌనంగా ఉన్నారు .

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు ప్రజాకర్షక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రజలు ముగ్దులైనారు అని అర్ధమవుతుంది .పించన్ల పెంపు దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంపు వరకు ..కళ్యాణ లక్ష్మీ దగ్గర నుండి షాదీ ముబారక్ వరకు ..మిషన్ కాకతీయ దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు ..గొర్రెల పంపిణీ దగ్గర నుండి బర్రెల పంపిణీ వరకు ..రైతు రుణాల మాఫీ దగ్గర నుండి వచ్చే ఖరీఫ్ లో రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల ఆర్ధిక సహాయమందించడం వరకు ..ప్రాజెక్టులను పూర్తిచేయడం దగ్గర నుండి ఐటీ ప్రాజెక్టులను రాష్ట్రానికి రప్పించడం వరకు ఇలా కేసీఆర్ సర్కారు అమలు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రజలు ఫిదా అయ్యి తమ అభిమానాన్ని ఇలా నినాదాలతో..అభివాదాలతో తెలియజెప్పారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .

సోషల్ మీడియాలో నెటిజన్లు అక్కడ ఉంది సినిమా హీరో కాదు…అక్కడ ఉంది క్రికెటర్ కూడా కాదు..ఆ ప్రాంత రాజకీయ నేత కాదు..అఖరికి ఆ ప్రాంత సీఎం అసలే కాదు..అక్కడ ఉంది తెలంగాణ సమాజం యొక్క అరవై ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి ..తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు పరుగులు పెట్టిస్తోన్న సీఎం KCR..అభిమానం అనేది ప్రాంతాలను బట్టో …ఇంకా దేన్నో బట్టి కాదు మనం చేసే పనులను బట్టే ఎదుటివారిలో కలుగుతుందనడానికి ప్రత్యేక్ష ఉదాహారణ ఇది…శత్రువునైనా మిత్రువుగా మార్చుకోగల దేశంలోనే ఏకైక దమ్మున్న ప్రజానేత మన KCR అని అంటూ పోస్టులు పెడుతున్నారు ….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat