తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్ పల్లిలో టీబీజీకేఎస్ తరఫున ఎంపీలు వినోద్ కుమార్, పసునూరి దయాకర్, సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. వివిధ సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ లో చేరారు. నేతలు వారికి కండువాలు కప్పి, టీబీజీకేఎస్ లోకి ఆహ్వానించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సమస్యలు సీఎం కేసీఆర్ తోనే పరిష్కారం అవుతాయన్నారు ఎంపీలు వినోద్ కుమార్, పసునూరి దయాకర్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తారని సివిల్ సప్లై ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు…
