ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే ఆయన తన అనుచరులతో అంతర్గత సమావేశాలు నిర్వహించి తన నిర్ణయం తెలియజేశారు..అనంతపురం నియోజకవర్గంలో వైసీపీకి ప్రధాన నాయకుడిగా ఉంటున్న గురునాథరెడ్డి టీడీపీలో చేరితే వారి కుటుంబం మొత్తం పార్టీ మారే అవకాశాలున్నాయని సీఎం ,టీడీపీజాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు అస్థాన వర్గానికి చెందిన ప్రముఖ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని వండి వార్చి ప్రచురించిన సంగతి తెల్సిందే…ఈ వార్తలపై మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి స్పందించారు.ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అతి సన్నిహితంగా కొనసాగుతున్నాను..ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ అశీస్సులతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాను. ఆ తరువాత వైఎస్ అకాల మృ తి చెందాక ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరాను.కడవరకు నా ప్రయాణం జగన్ తోనే …నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవు..అవన్నీ సీఎం చంద్రబాబు బ్యాచ్ తనపై చేస్తోన్న విషప్రచారమని ఆయన పార్టీ మార్పుపై క్లారీటిచ్చారు…
