Home / ANDHRAPRADESH / వైసీపీకి ఇన్‌క‌మింగ్‌ సీజ‌న్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివ‌ల్స్‌..!

వైసీపీకి ఇన్‌క‌మింగ్‌ సీజ‌న్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివ‌ల్స్‌..!

నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయావకాశాలు లేవని పదే పదే ప్రజల్లోకి తీసుకు వెళుతున్నా నేతలు ఆ పార్టీ వైపు చూడటానికి కారణాలేంటని సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీని వీడి టీడీపీలోకి వరుస బెట్టి వచ్చేస్తారని పార్టీ నేతలు భావించారు. వచ్చే వారిని పార్టీలో ఎలా అడ్జెస్ట్ చేయాలని కూడా లెక్కలు కట్టారు.

అంతే కుకుండా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే రఘురామిరెడ్డి తాను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అలాగే సీమ జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా కొన్ని పేర్లు వినిపించాయి. అయితే ఏ ఒక్కరూ పార్టీలో చేరేందుకు ముందుకు రాలేదు. మరోవైపు వైసీపీలో రోజుకో నేత చేరుతుండటంపై చంద్రబాబు ఆరా తీసినట్లు తెలసింది. అయితే స్థానిక నాయకత్వ సమస్యల కారణంగానే వారు వైసీపీకి వెళుతున్నారని సీనియర్ నేతలు చెప్పారట. దీంతో చంద్రబాబు మాత్రం అలా వరుస చేరికలు జరుగుతుంటే వైసీపీకి మళ్లీ ఊపు రాదా.. అని ప్రశ్నించారట. మాజీ ఎంపీ చిమటా సాంబు పార్టీని వీడటానికి కారణాలను కూడా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక అధికార పార్టీలో చేరికలు లేకుంటే బూస్ట్ రాదని తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఆశించినట్లు పార్టీలో ఎవరూ చేరకపోగా, ప్రత్యర్థి పార్టీలో చేరికలు జరుగుతుండటం టీడీపీకి మింగుడు ప‌డ‌డంలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat