ఆనంద్ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ముద్ర వేసుకున్న హీరో రాజా.. కొన్ని మంచి సినిమాలు తీసినా తర్వాత తర్వాత ప్లాప్ లు చుట్టుముట్టడంతో అతని సినిమా కెరీర్ పూర్తిగా అంతం అయిపోయింది, అప్పట్లో అమ్మాయిల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న అతని పేరు కూడా మర్చిపోయారు ఇప్పుడు ప్రేక్షకులు. ఇంతకీ అతను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా .. ఆమె అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక రాజకీయ నాయకుడి కుమార్తె. అప్పట్లో హీరో రాజాకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉండేవని టాక్. ఆ పరిచయాలతోనే అతనికి చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని ఇండస్ట్రీలో అనుకుంటారు. అలా రాజకీయనాయకులతో పరిచయం ఉన్న ఆయన ఒక ఎమ్మెల్యే కూతురుని ప్రేమించాడని సమాచారం
ఇక ఇద్దరు ఘాడంగా ప్రేమించుకున్నారట..ఆమెకు కూడా ఆయన అంటే ఇష్టమట.. కుటుంబ సభ్యులు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారట. అయితే ఆతర్వాత అప్పట్లో కాస్తో కూస్తో మంచి సినిమాలు చేసిన రాజా కెరీర్ ఒక్కసారిగా ఫ్లోప్స్ వైపు వెళ్ళసాగింది..అదే సమయంలో దురదృష్ట వశాత్తు వై.యస్.రాజశేఖర్ రెడ్డి హతన్మరణంతో అతనికి సినిమా ఛాన్సులు కూడా తగ్గ్గిపోయాయి. దీంతో అతని పరిస్థితి గమనించిన ఆ ఎమ్మెల్యే అతనికి తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదట. వెంటనే ఆమేకు వేరొకతనితో పెళ్లి చేసేసారట. దీంతో క్రుంగిరిపోయిన ఆయన కొన్నియు రోజులు బయటకు కూడా రాలేదు. ఆ తర్వాత రాజా పూర్తిగా క్రిస్టియానిటీకి అంకితం అయిపోయి సినిమాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో సభ్యుడిగా ఆయన పని చేస్తున్నారు. చూసారుగా సక్సెస్ ఉన్నంతసేపే బంధాలు ఉంటాయి. సక్సెస్ లేకపోతే మనల్ని ప్రేమించిన వారు కూడా దూరం అయిపోతారు.