టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ పేరు వినగానే.. బాధల్లో ఉన్నవారు కూడా ఆలోచించకుండా నవ్వే స్తుంటారు. దశాబ్దాలుగా తెలుగు సినీ హాస్యాన్ని ఒంటిచేత్తో నిలబెట్టిన ఈ కామెడీ కింగ్ సంబందించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే బ్రహ్మానందం ఆరోగ్యం గత కొద్ది రోజులుగా బాగులేదని..ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా మారిందని ప్రస్తుతం అపోలో ఆస్పత్రి లో చికిచ్చ పొందుతున్నారనే వార్త సినీ అభిమానుల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే తెలుగు సినీ ముద్దు బిడ్డలు ఒక్కొకరుగా కన్నుమూయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గందరగోళం సృష్టిస్తోంది. ఇక ఈ వార్త పై నిజనిజాలేంటో పూర్తిగా తెలియాల్సి ఉంది.. నిజంగా బ్రహ్మాతనందం ఆరోగ్య పరిస్థితి బాగులేదో.. లేక ఎవరైన గిట్టని వారు ఈవార్తని స్పెడ్ చేశారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బ్రహ్మానందం.. ఆయురాగ్యాలతో ఉండాలని తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీతో అలరించాలని తెలుగు సినీ అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
