బల్దియాలో 300 మంది సివిల్ ఇంజనీర్లను ఔట్ సోర్సింగ్ పద్దతిన నియమించనున్నారు. ఈమేరకు మున్పిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ పనులు వేగవంతం చేసింది..అందుకోసం హౌసింగ్ , ఇతర అభివృద్ధి పనుల కోసం కోసం సివిల్ ఇంజనీర్లను అవుట్ సోర్పింగ్ పద్దతిన నియమించాలని మంత్రి కేటీఆర్ నెల రోజుల క్రితమే జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు..ఈ మేరకు ఫోన్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.బీఈ, బీటెక్, ఏఎంఐఈకు చెందిన ఇంజనీరింగ్ అభ్యర్తులకు మెరిట్ ప్రకారం అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఈ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తున్నట్టు , ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించే వీరిని ఏడాది కాలపరిమితితో విధుల్లోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. హలో.. బిటెక్, బీఈలు చేసి ఖాళీగా ఉన్నఇంజనీరింగ్ బాబులు ఇంకెందుకు ఆలస్యం..త్వరపడండి..
