తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న అరుదైన సందర్భం ఈరోజు అనంతపురంలో చోటు చేసుకుంది. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు.. ఇక గవర్నర్ అధికారిక విందులలో ఇద్దరు సీఎంలు కలుసుకుంటూనే ఉన్నారు..తాజాగా ఈ రోజు అనంతపురం జిల్లా, వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరిగిన సంగతి తెల్సిందే..ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు..అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు సీఎంలు కుశల ప్రశ్నలు అడిగి కాసేపు సంభాషించారు..చంద్రబాబుతో సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ హాజరయ్యారు.