భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది..వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా, స్టోయినిస్, వేడ్‌లు రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా
భారీ స్కోర చేయలేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్, కేదార్ జాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాకపోతే నాగపూర్ బౌలింగ్ పిచ్ కావడంతో ఆస్ట్రేలియా భారత్‌ను కట్టడి చేయడానికి ఈ స్కోర్ చాలని భావిస్తుంది.కాగా మంచి ఫాంలో ఉన్న భారత్ బ్యాట్స్‌మెన్ 243 పరుగుల లక్ష్యం ఈజీగా ఛేజ్ చేయగలరని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు..