కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే రకం కాదు అని అమ్మడు నిరూపించింది.అయితే ఈ ముద్దు గుమ్మ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో తనకు ఇంతవరకు ఎంతమంది ప్రపోజల్ చేశారో లెక్కలతో సహా చెప్పారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ”తాను కాలేజ్ లలో చదువుకునే రోజుల్లో చాలా మిత్రులుండేవారు..ముఖ్యంగా నా వెంట చాలా మంది అబ్బాయిలు ప్రేమించమని వెంటపడేవాళ్ళు ..ఎంతమంది అంటే అంతమంది ఇంతమంది చెప్పడానికి కూడా లెక్కలేనిమంది తనకు ప్రపోజల్ చేసేవారు..వాళ్ళు నా వెంటపడుతుంటే ముందు చీరాకేసేది..కానీ తర్వాత వాటి గురించి అలోచిస్తే చాలా గర్వంగా ఉండేది..అయితే అంతమంది అబ్బాయిలు విసిగిస్తూ వెంటపడి ప్రపోజల్ చేస్తుంటే గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇంట్లో మాత్రం చెప్పకపోయేదాన్ని..ఎందుకంటే ఒక అమ్మాయి నచ్చితే ప్రపోజల్ చేయడం కామన్..అట్నే ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి.అంతే కానీ పగలు కక్షలు ఎందుకని చెప్పలేదు…ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ప్రపోజల్ చేశారు..కానీ నేను సున్నితంగా తిరష్కరించాను తప్పా ఎక్కడ తప్పు చేయలేదు..చేయను అంటూ అమ్మడు తన వెంట పడ్డ అబ్బాయిల లిస్టు చెప్పిందంటూ ఆ ప్రముఖ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.మరి ఇందులో ఎంత నిజముందో ఆ ముద్దుగుమ్మకే తెలియాలి…