ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల హామీలపై ఏర్పాటుచేసిన భారీ సభకు ఎమ్మెల్యే ఆర్కే రోజా ముఖ్యాధితిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది వైసీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు హజరయ్యరు అని సమాచారం… అయితే ఈ కార్యక్రమంపై స్థానికులు పిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేశారని ముఖ్యంగా బాబు అస్థాన వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక వార్తలను ప్రచారం చేసింది…ఈ వార్తలపై ఎమ్మెల్యే రోజా తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా వివరణ ఇచ్చారు…తన అరెస్టుపై రోజా స్పందిస్తూ”తనపై వస్తోన్న అరెస్టు చేశారనే వార్తలను ఆమె కొట్టిపారేశారు..తనని ఎవరు అరెస్టు చేయలేదని ఆమె వివరణిచ్చారు…సభకు ఊహించని దాని కంటే ఎక్కువ మంది హజరయ్యారు..దీంతో పోలీసులు అక్కడకి చేరుకోని ఇలా ఎక్కువమంది గుమికూడదు..ఇంత భారీ స్థాయిలో సమావేశాలు,సభలు పెట్టకూడదు అని చెప్పారు.అయితే ఈ కార్యక్రమ నిర్వాహకులు వివరణివ్వడంతో పోలీసులు తమ ప్రతిపాదనను అంగీకరించి అక్కడ నుండి వెళ్ళి పోయారు.అంతే మినాహా ఎవర్ని అరెస్టు చేయలేదు..వాస్తవాలు తెలియకుండా…తమను సంప్రదించకుండా వార్తలను ముఖ్యంగా తమపై విషప్రచారన్ని చేయడం మానాలని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు…
