రామ్ చరణ్ తేజ్ మొదటిగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యువహీరో..ప్రతి సినిమాకు సరికొత్త వైవిద్యాన్ని జోడిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు..ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు..తాజాగా తన తండ్రి 151మూవీకి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఒక పక్క తాను నిర్మాతగా వ్యవహరిస్తునే మరో వైపు తాను ఒకవైపు హీరోగా బిజీగా ఉంటునే మరోవైపు తన సరికొత్త ఇంటి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు చెర్రీ..అయితే సరికొత్త హాంగులతో దాదాపు నలబై కోట్లకు పైగా ఖర్చుతో ఆ ఇంటిని నిర్మించబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..తనకు డ్రీం ప్రాజెక్టు అయిన ఈ ఇంటి కోసం చెర్రీ ఇతర దేశాల నుండి సాంకేతక నిపుణులను తెప్పిస్తున్నాడు అని సమాచారం.అంతే కాదు అన్ని హాంగులతో కూడిన ఇంటిరీయర్స్ ,సకల సదుపాయాలతో సహా ఒక ప్రత్యేక స్విమ్మింగ్ ఫూల్ ను కూడా కట్టిస్తున్నాడు అంట చెర్రీ.ఎంతైన మెగాస్టార్ వారసుడు అందులో మెగాపవర్ స్టార్ కదా ..ఆ మాత్రం పెట్టకపోతే ఎలా అని ఫిల్మ్ నగర్ లో అందరు చెవులు కొరుక్కుంటున్నారు….
