తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు దసరా వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు .అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో దుర్గాదేవి పూజను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . టీన్యూస్ ఎండీ సంతోష్ కుమార్ ,రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు .