తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఒక యువతిని దారుణంగా హతమార్చి పైపు లైన్ కందకంలో పూడ్చివేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .స్థానిక పోలీసుల కథనం ప్రకారం జిల్లాలో కాటారం మండల కేంద్రంలో గంటగూడేనికి చెందిన గంట సుగుణకుమారి తల్లి దండ్రులు కొద్ది రోజుల క్రితమే మరణించారు .
దీంతో సుగుణ తన సోదరుడు అన్న రామచంద్రు ,సోదరి రజితతో కల్సి ఉంటుంది .దుబ్బగూడేనికి చెందిన గాలి సారయ్య తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు .ఈ నేపథ్యంలో సారయ్య కు సుగుణతో పరిచయం ఏర్పడింది .ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది .కొన్నేళ్ళ పాటు బాగానే ఉన్నారు .దీనిలో భాగంగా గత కొద్ది రోజులుగా సహా జీవనం కొనసాగిస్తున్నారు .
ఒకరోజు రాత్రి సారయ్య సుగుణను కాటారం శివారులో కొండవేప తోటలోకి తీసుకెళ్ళాడు .ఆ సమయంలో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది .దీంతో సారయ్య ఆవేశాన్ని తట్టుకోలేక సుగుణను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది .దీంతో విషయం బయటకు వస్తుందేమో అని భయపడి సారయ్య సుగుణను సమీపంలోని పైపులైన్ కందకంలో వేసి ట్రాక్టర్ సహాయంతో మట్టి వేసి పూడ్చి వేశాడు .ఈ విషయం పోలీసులకు తెలియడంతో సీఐ చింతల శంకర్ రెడ్డి .ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసి విచారిస్తున్నారు .