తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య మహార్నవవి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే శుభాకాంక్షలు చెబుతూ అందరు ఆలోచింపచేసేలా ఓ చక్కటి మెసేజ్ అతడు ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ నవమి సందర్భంగా ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బుకోసం తన భర్తను బ్రతిమలాడుకోకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి కాకూడదని.. ఏ సీతా నిశ్శబ్దంగా బాధపడకూడదని.. ఏ కాళీదేవికి ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వకూడదని..ఈ నవమి సందర్భంగా ప్రార్థించండి.. అని సూర్య ట్విట్లర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క ట్వీట్ ద్వారా మహిళా సమస్యలపై, అందరిలో ఆలోచనలు కలిగించేలా చేసినందుకు నెటిజన్లతో పాటు మహిళా లోకం సూర్యకు సలాం కొడుతున్నారు.
