టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త చిత్రం రాజా ది గ్రేట్ సినిమాను వెరైటీగా పబ్లిసిటీ చేయడానికి, ఆ చిత్రంలో నటించిన హీరో రవితేజ, హీరోయిన్ మేహ్రీన్, మరియు నటకిరీటి రాజేంద్రప్రసాద్, కమెడియన్ శ్రీనివాస్ లు కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ… ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. ఈ వీడియోలోనే రవితేజ ఇలా వినూత్నంగా ట్రై చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పటాస్, సుప్రీమ్ వంటి రెండు కమర్షియల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమాగా రాజా ది గ్రేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
