ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్.. క్రికెట్ వెనుక జరిగే రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, కోచ్ లు హితబోధ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదని తెలిపింది. టీమిండియాలో చాలా పాలిటిక్స్ ఉంటాయని తెలిపింది. మహిళా క్రికెట్‌లో కూడా ఉన్నాయని చెప్పింది. కేవలం క్రికెట్ అని మాత్రమే కాదని, ప్రతి రంగంలోనూ రాజకీయాలు ఉన్నాయని తెలిపింది. టీమిండియా ఆటగాళ్లతో హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేలా తమతో ఎవరూ తిరగరని తెలిపింది. తనవరకు అలాంటి అనుభవాలు లేవని చెప్పింది. మూడు సార్లు ప్రేమలో విఫలమయ్యానని మిథాలీరాజ్ వెల్లడించింది. విజయవంతమైన ఇండిపెండెంట్ మహిళగా తనకు కాబోయే భర్త గుర్తించాల్సిఉంటుందని తెలిపింది.