తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులతో పాటుగా రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్త .మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంతగా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే .అయితే అంతగా అభిమానించే క్రికెట్ ప్రేమికులకు దసరా పండగ పర్వదినాన తీపి కబురు .
అదే రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో టీం ఇండియా మరియు ఆసీస్ ల మద్య జరగనున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్ కు టికెట్ల అమ్మకం అప్పుడే మొదలైంది .హైదరాబాద్‌లో జరిగే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కోసం అప్పుడే సందడి మొదలైంది. ప్రస్తుతం ఇండియా లో పర్యటిస్తున్న ఆసీస్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అక్టోబర్ 13 తేదిన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆసీస్‌తో భారత్ ఆఖరిదైన మూడో టీ20 ఆడనుంది.
ఇందుకోసం మ్యాచ్ టిక్కెట్ల విక్రయాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. అయితే క్రికెట్ ప్రేమికులు ,అభిమానులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనాలనుకున్నవారు www. eventsnow.com అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్ తెలిపాడు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను బుక్‌చేసుకున్నవారు వచ్చేనెల 7న జింఖానా మైదానంలో ఒరిజినల్ టిక్కెట్లను తీసుకోవాల్సి ఉంటుందని శేష్‌నారాయణ్ ఈ సందర్భంగా తెలిపారు .అయితే ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల ధరను రూ. 800, రూ. 1000, రూ. 1500, రూ. 5000, రూ. 7500, రూ. 12,500, రూ. 20000గా నిర్ణయించారు.