తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు శని,రేపు ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ఉపరితలం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా భూ ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో గ్రేటర్తోపాటు, జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
