తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ” సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి.. కోటి ఎకరాలకు నీరందిస్తామని మరోసారి ఉద్ఘాటించారు. మతసామరస్యానికి సిద్ధిపేట ప్రతీక అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి పాల్గొన్నారు ..