సహజంగా చదువు పూర్తి అయినతర్వాత ఏమి చేస్తోన్నావు అని అడిగే తోలి ప్రశ్న .చదువుకునే సమయంలో బాగా చదవాలని ఒత్తిడి తీసుకొస్తారు .తీరా చదువు అయిన తర్వాత ఏమి చేస్తోన్నావు .ఇంకా ఉద్యోగం రాలేదా అని ఇంట బయట ఒకటే నస .ఎంతగా అంటే చదువు అప్పుడే ఎందుకు పూర్తిచేసామా అని అనిపిస్తుంది నేటి యువతకు .అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ .ఒకటి కాదు ఏకంగా రెండు లక్షల సర్కారు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది .అసలు విషయానికి వస్తే మన దేశంలోని అతిపెద్ద రంగమైన రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది అని వార్తలు వస్తోన్నాయి . అయితే ఈ భర్తీ రెండు ధపాలుగా ఉంటుంది అని సమాచారం .దీనిలో భాగంగా ఒకటి ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (పీఈటీ), రెండు దశగా రాత పరీక్షను నిర్వహించి.. అర్హత సాధించిన వారికి మెడికల్ పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ కేడెట్లకు ఎత్తు 165.0 సెంటీమీటర్లు, చాతి భాగం 80-85, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు 160.0సెంటిమీటర్లు, చాతి 76.2-81.2 ఉండాలి. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరికి 157.0సె.మీ., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 152.సెం.మీ. ఉండాలి. అదేవిధంగా పురుష అభ్యర్థులు 1600మీటర్ల పరుగు పందాన్ని 5నిమిషాల45 సెకన్లలో, హైజంప్ 3.9ఫీట్లు (రెండు అవకాశాలు), లాంగ్‌జంప్ 14 ఫీట్లు (రెండు అవకాశాలు), మహిళ అభ్యర్థులు 800 మీ. పరుగును 3.40సెకన్లు, హైజంప్ 3ఫీట్లు (రెండు అవకాశాలు), లాంగ్ జంప్ 9 ఫీట్లు (రెండు అవశాలు) ఉంటుంది.
అదేవిధంగా రాత పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ (100 మార్కులు) సబ్జెక్టులో కరంట్ అఫైర్స్, హిస్టరీ, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ తదితర అంశాలుంటాయి. ఎస్‌ఏ రైటింగ్ విభాగంలో 50మార్కులకు ఏదో ఒక అంశంపై ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్‌లో వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ప్రశ్న పత్రంలో (50మార్కులు) గ్రామర్, కరెక్షన్ ఆఫ్ సెంటేయిన్స్, ఇతర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.రైల్వేశాఖలో ఆర్పీఎఫ్ ఉద్యోగానికి పదోతరగతి ఉత్తీర్ణత అర్హతగా కేటాయించారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇస్తారు. ఆర్పీఎఫ్ నియామకాల కోసం ప్రస్తుతానికి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానున్నా.. కొలువులను కేటగిరి వారీగా కేటాయించారు. జనరల్ కోటాలో 8901, ఎస్సీ విభాగంలో 3317, ఎస్సీ విభాగంలో 3363, ఓబీసీ కేటగిరిలో 4371పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. 2018 జనవరి నాటికి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నాహాలు మొదలు పెట్టింది. అక్టోబర్ 14న చివరి దరఖాస్తు తేదీగా నిర్ణయించినట్లు సమాచారం .ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ‘http://www.indianrailways.gov.in/’ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.