తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు కవిత ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎంపీ కార్యాలయం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.
కుల, మతాలకు అతీతంగా ఎంపీ కార్యాలయం ఆలయంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనగోలు కేంద్రాల్లో అమ్మలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి ఈ సందర్బంగా అన్నారు .