Home / MOVIES / ఇండియన్ స్క్రీన్‌‌పై మరో సంచలనం…భారతీయుడు సీక్వెల్‌ ఫిక్స్‌..!

ఇండియన్ స్క్రీన్‌‌పై మరో సంచలనం…భారతీయుడు సీక్వెల్‌ ఫిక్స్‌..!

లెజండరీ యాక్టర్ కమల్‌హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సిన్మా భారతీయ సినీ చరిత్రలో సంచలనం రేపింది..హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నెలకొల్పింది. అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా శంకర్ సంధించిన అస్త్రం భారతీయుడు. వ్యవస్థలో వేళ్లూనుకున్న లంచం మహమ్మారిని అంతమొందించడానికి, లంచం తీసుకున్న వ్యక్తులను హతమార్చే ఓ 70 ఏళ్ల మాజీ స్వాతంత్ర్యయోధుడి పాత్రలో కమల్ జీవించారు. లంచం తీసుకున్నందుకు కన్నకొడుకును కూడా చంపడానికి వెనకాడని భారతీయుడి పాత్రలో కమల్ నటనకు దేశం యావత్తు ప్రశంసలు కురిపించింది. తండ్రిగా, కొడుకుగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతీయుడి పాత్రలో కమల్‌హాసన్ నట విశ్వరూపం చూపించారు..శంకర్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ ఈ సిన్మాను భారతీయ సినీ చరిత్రలో మరపురాని చిత్రంగా నిలిపాయి. భారతీయుడి తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడి సీక్వెల్‌ వస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు..కానీ తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు కమల్, శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడి సీక్వెల్ తీయ బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ భారతీయుడు-2 మూవీ కోసం కమల్‌.. డైరెక్టర్ శంకర్‌ సంతకం చేసినట్లు తెలుస్తోంది..గత కొంత కాలంగా కమల్ తమిళ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంలోని అవినీతి అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. .ప్రస్తుత తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతిని టార్గట్ చేస్తూ భారతీయుడి సీక్వెల్ రాబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఇటు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడం సౌత్ ఇండియాలో సెన్సేషన్‌గా మారింది. మరి భారతీయుడి సీక్వెల్‌ కార్యరూపం దాలిస్తే మాత్రం..భారతీయ సిన్మాలో రికార్డులు తిరగరాయడం ఖాయం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat